About

WELCOME TO B.C.PARTY

భారతీయ చైతన్య పార్టీ కి చెందిన బి.సి. కళామండలి విన్నపములు ఐక్యరాజ్యసమితి సందేశం ననుసరించి బి.సి.పార్టీగా అవతరించవలసిన అవసరం ఉంది.

( అధిక కులముల పేదలు, వారిమనుగడ కోసం - వారే నడుం బిగించాలి లేదా మరో దశాబ్దంలో మానవ జాతి విలువలు నాశనమవుతాయి ) అని హె చ్చరించినది. ఈ సందేశం ననుసరించి పార్లమెంటు పంధా పడిపోకుండా, దాని విలువను పెంచడానికి బి.సి. పార్టీని నిలబెట్టవలసిన అవసరం ఉంది.

 

ఒ.సి.,  ఎస్.సి,  ఎ.స్.ల్లో చదువర్లు, సంపన్నులు ఉనట్లే బి.సి లలోనూ ఉన్నారు. చొరవకు,శౌర్యమునకు అన్నింటిలో ముందున్నా సొంత రాజకీయ పార్టీ విషయంలో , పాలన విషయంలో అరవై ఆరు సంవత్సరాలు వెనుకే ఉన్నారు.

 

బి.సి. ప్రముఖులు నడుము బిగించి సొంత  రాజకీయ పార్టీ వైపు కృషి చేయకపోతే  !!  దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బి.సి. జాతులకు తలదిపే !!ఈ వ్యవస్థను మార్చడానికి - బోసుల మవ్వద్దు, యేసుల మవ్వద్దు - నక్సలైట్ల మవ్వద్దు,బుద్ధుల మవ్వద్దు - మరి బి.సి. పార్టీ మంత్రులమైతే చాలు. బి.సి. ప్రజల విలువ పెరుగుతుంది.బి.సి.ఓటర్లకు విలువ పెరుగుతుంది.

 

అన్ని పార్టీలు  54  శాతం  ఎమ్.ఎల్.ఎ.  టికెట్లు, ఎమ్.పి. టికెట్లు ఆఫర్ చేస్తాయి. బి.సి.పార్టీ మంత్రులమవ్వాలంటే బి.సి.పార్టీ నిలబడాలి. బి.సి.పార్టీ ద్వారా పోటిచెయ్యాలంటే ?  సకల బి.సి.లను ఎడ్యుకేట్ చెయ్యాలి.

 

దేశ జనాభాలో  సగానికి పైగా ఉన్నబి.సి లను ఐక్యం చేయుట చాలా తేలికైన పని. ఒకరి ద్వారామరొకరికి, వారి ద్వారా  ఇంకొకరికి  ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. ఇదిమన బి.సి. తల్లి సమస్య. కనుక బి.సి.పార్టీ

 

ఆవశ్యకతను ఔన్నత్యమును  చాటి చెప్పడం - మాటలు,పాటలు ద్వార క్యాసెట్లు పంపిణీ చేయుట, కరపత్రాలువిస్తృతంగా  ముద్రించి సరఫరా చేయడం, వీధీ వీధీ  కి  పాటలు  పాడి, మీటింగులు పెట్టడం 

 

మొదలగు కార్యక్రమాలు చేస్తుంది. బి.సి.ల్లో ప్రతిభా వంతులు, డబ్బు సంపాదించడం చేతనైన మహానుభావులు ఉన్నారు. స్వచ్చంద  సంస్థలకు, ట్రస్టులకు,మత సంస్థలకు దానంచేసే త్యాగమూర్తులు ఉన్నారు.

 

మెజారిటీ పేద ప్రజల పార్టీ  బి.సి. పార్టీకి చెందిన బి.సి ట్ట్రస్టి కి ఆర్దికంగా సహకరిస్తే మానవసేవే మాధవసేవ అవుతుంది.

ప్రాధమిక దశలో సహకారము  అత్యంత విలువైనది.

 

పార్టీ ఉన్నంతకాలము పార్టీ ఫౌండర్స్ గా  మీపేర్లు లిఖించబడతాయి.చిరస్థాయిగా నిలుస్తాయి. బి.సి.పార్టీ అభిమానులు తమవంతు కర్తవ్యంగా, బాధ్యతగా,సహకారంగా, పార్టీ మనుగడకు బాగాస్వాములు కావాలని,

 

కార్య కర్తలకు  ఆర్ధికంగా  సహకరించాలని, సకల పేదల సంక్షేమ , సంస్కరణగా తీర్చిదిద్దిన ఏకైక పార్టీ మీముందుకు వస్తుంది. మేధావుల  అశీర్వాదము, విధ్యావేత్తల,ధీవింపు, సంపన్నుల సహకరింపు ఇచ్చిన మనోబలమే  బి.సి.పార్టీ ఆవిర్భావం .

 

 

అన్ని వర్గాలవారికి సొంత రాజకీయ పార్టీలు ఉన్నాయి  బి.సి వర్గానికి సొంత రాజకీయ పార్టీ లేనందున ఈ లెటర్ మీకు పంపించడమైనది.

రాజ్యాధికారం ధ్యేయం కాదు - రాజ్య శ్రేయసు ధ్యేయం, ఎందుకంటే నానాటికి చితికిపోతున్న బి.సి.లకు అన్నిరంగాలలో కూడా అవకాశాలు చాలాతక్కువ.

 

ఓట్లసంఖ్యలో  లెక్కకు మించి ఉన్నాము అంటే దేశ జనభాలో సగానికి పైగా ఉన్నాము.

బానిస మనస్తత్వం నుండి, శాసనకర్తలుగా మనమూ ఎదగాలని, సకల బి.సి.లకు సొంత రాజకీయ పార్టీ  అవసరమని ఈ వర్గాలలో ఉన్న మేధావులు విద్యావేత్తలు, చరిత్రగతిని నిశితంగా పరిశీలించి  తీసుకున్న నిర్ణయం.

 

ఒక్క     బి.సి.ల ఓట్లతోనే అసెంబ్లీలోను పార్లమెంటులోను  సొంత ప్రభుత్వాలను  ఏర్పా టు చేయవచ్చు .  బి.సి. జనాభాలో సగం మంది ఓట్లు వేస్తే పూర్తి మెజారిటీ వస్తుంది. యింతటి  ఓటు బ్యాంకుఉన్న మనము స్వాతంత్రము  వచ్చి అరవై ఆరుయేళ్ళు  అయినా  సొంత  రాజకీయ  పార్టీ  ఏర్పాటు  చేయలేక  పోయాం .ఎస్.సి.వర్గంలో ఉన్నమేధావులు సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

 

వాళ్ళ జనాభా చాలా తక్కువ ఓ.సి.వర్గంలో ఉన్న ధనికులు  అధికారం కోసం ఎన్ని రాజకీయ పార్టీలు స్థాపించినారో మీ కందరికి తెలుసు, వాళ్ళ జనాభా శాతం చాలా తక్కవ దేశంలో సగానికి పైగా ఉన్న బి.సి వర్గంలోని మేధావులు, స్వాతంత్రము వచ్చి  66  సం||లు  అయినా సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చెయలేకపోవడం మాన బానిస మనస్తత్వమునకు నిదర్శనం  కాదు.

 

వ్యవసాయ పనులు , కులవ్రుత్తులకు అంకితమై ప్రజాజీవనానికి  అవసరమైన వస్తు ఉత్పత్తి  ఆహార ఉత్పత్తి సాధిచడం లో  నిమగ్నమై రాజకీయాలను పట్టించుకో లేదు.ఆ  కారణంగా కుల వృత్తులను దెబ్బతీసే  అత్యాధునిక యంత్రాలు వచ్చి మన జీవితాలను శాసిస్తునాయి. రాజకీయ అధికారం ఉన్నవాళ్ళ చేతుల్లో    ఈ   యంత్రాలు, యంత్రాంగం  ఉండుటవలన  కులవ్రుత్తులు దివాళ    తీశాయి. ధీని ఫలితం చాలీచాలని బ్రతుకులు, ఆకలి చావులు ఈ రకంగా బి.సి.లు  కృశించుకు పోతున్నారు. అభివృద్ధి చెందుతున్న వర్గాలతో పాటు  మనమూ  అభివృద్ధి  చెందాలంటే  రాజకీయ  వాటా కోసం పోటిపడాలి

 ( 1 ) ప్రజాస్వామ్య పార్లమెంటు పంధాలో,మీరు యుద్దాలు చేయనక్క రలేదు.వేరే పార్టీకి వేసే ఓటును మీసొంత పార్టీకి  వేసుకొంటే చాలు  మనబ్రతుకులు బాగుపతాయి  మన విలువలు, గౌరవాలు ,    పెరుగుతాయి.

( 2 )    రాజ్యాధీకారం కొనసాగడానికి ప్రముఖ ఆయుధ భీజము ఓటు.  ఆ ఓట్లు ఎవరికీ ఎక్కువ ఉంటే వాళ్ళే పరిపాలించాలి. ఇదే పార్లమెంట్ పంధా.

( ౩ )    ఇంతవరకూ అన్నిపార్టీలు  చూసారు .ఏమున్నది  గర్వకారణం  మెజారిటి ప్రజలకు దారిద్రం తప్ప. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బి.సి.లకు బి.సి సెల్. బి.సి. రిజర్వేషన్ ద్వార  దారిద్రం  ఆకలిచావులు        పోవాలంటే మరో  వె య్యేళ్ళు యినా  సరిపోదు.

(  4 )  అధికశాతం  ఉన్న బి.సి. వర్గానికి  సొంత పార్టీ అవసరం. సొంత రాజకీయ పార్టీ  ఏర్పాటు చేయడానికి  70సంవత్సరాలు  పట్టింది, 

( 5 )  పార్టీ  రిజి  రిజిస్ట్రేషన్  కొరకు డిల్లీ వెళ్ళే కార్యక్రమములో మేధావులను ,విధ్యా వేత్తలను, సంపన్నులను కలుసుకొని  బి.సి. పార్టీ ని స్టాపించుటకు ఎనలేని కృషి చేస్తున్నాము.

( 6 ) ఆ  కృషి ఫలితమే బి.సి. పార్టీ  జాతీయ పార్టీ గా అవతరించ నుంది. ప్రలోభాలకు ఆశపడకుండా, పదవులను లెక్కచేయకుండా, అశేష బి.సి.ప్రజల అభ్యున్నతికి  నిరంతరం పాటుపడుతూ  బి.సి. రాజ్యం

      స్థాపించుటకు ఎనలేని కృషి చేస్తున్నాము. ఆ కృషి లో  భాగంగా  మీవంతు  సహకారం  అందించాలని, బి.సి. కళా మండలి  కోరుచున్నది.

 

 భారతీయ చైతన్యపార్టీ

ఆంధ్రప్రదేశ్

అధ్యక్షులు

మీ కట్టా కృష్ణ  B.A